calender_icon.png 9 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతా

09-08-2025 01:22:24 AM

-కోవలక్ష్మి చేసిన అభివృద్ధి కనిపించడం లేదరా...శ్యాం నాయక్..!

-చదువు ఉంటే సరిపోదు.. మహిళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో..

-అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు..

-మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 8 ( విజ యక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చదువు ఉంటే సరిపోదనీ  మాట్లాడే సం స్కారం  నేర్చుకోవాలని హితవు ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా శ్యాం నాయక్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి చేసిన అభివృద్ధి పనులు కనిపించడం లేదరా శ్యాం నాయక్.. అయితే గల్లి గల్లి వెళ్లి ప్రజలను అడుగుదాం రా.. అని సవాల్ విసిరారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండేళ్ళ కావస్తున్నా. ప్రతీ పక్షం ఎమ్మెల్యేనైనా తనకు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రుపాయ ఇచ్చి పాపాన పోలేదని ఆరోపించారు. నీకు దమ్ముంటే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోచ్చి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కేసీఆర్‌నే మాజీ ఎమ్మెల్యే రేఖ నాయ క్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుందని, ఇక్కడ శ్యాం నాయక్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ మంత్రి భీమ్రావు కూతురుగా తమకు మంచి పేరు ఉందని నిజాయితీతో ఉంటామన్నారు. నన్ను పార్టీ మారాలని చాలా మంది ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చిన నిజాయితీ, నిబద్ధతతో బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని హాట్ కామెం ట్స్ చేశారు. తన వ్యక్తిగత జీవితంపై మరోసారి మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీరు అధికారుల లేక.! కాంగ్రెస్ కార్యకర్తలా... రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడండి.. గత పాలన గురించి మీకేం అవసరం అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ)ని  ఉద్దేశించి ఘాటు గా వ్యాఖ్యానించారు.మీ విధులు మీరు చేసుకోండి.ఎమ్మెల్యేగా తన పూర్తి సహకారం ఇస్తానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు బుర్స పోచయ్య, సరస్వతి ,అలిబిన్ హైమద్ ,శ్రీధర్, అజయ్ ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.