29-08-2025 01:07:23 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 28 ( విజయక్రాంతి ) తరచూ గుప్తనిధుల కోసం వేట కొ నసాగించే ఓ వ్యక్తి పలువురుతో గుప్తనిధుల జాడ కనిపెడతానంటూ భారీగా డబ్బులు వసూలు చేయడంతో తిరిగి తమ డబ్బులకోసం ఒత్తిడి చేసిన బాధితులను మరి కొన్ని డబ్బులు ఇవ్వకుంటే స్వామీజీ మిమల్ని భస్మం చేస్తాడంటూ హెచ్చరించడంతో విసిగి పోయిన బాధితులు పథకం ప్రకారం హథమార్చి పొలంలో పూడ్చిపెట్టిన ఘటన నాగ ర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మై లారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది.
డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్ (45) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు గుప్తనిధుల తవ్వకాలు వాటి జడ వేట కొనసాగిస్తూ ఉండేవాడు. అచ్చంపేట పట్టణానికి చెందిన పులేందర్ గౌడ్ ( పుల్లయ్య గౌడ్)తో గత ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది 40 ఎకరాల ల్యాండ్ కొనుగోలు ఉందంటూ పరిచయమైన వీరిద్దరూ గుప్త నిధులు జాడ వెతికి పెడతానంటూ రంగసా ని పులేందర్ వద్ద ఐదు లక్షలు వసూలు చేశాడు.
గుప్తనిధుల జాడ కోసం తనను ఒత్తిడి చేయడంతో తనకు తెలిసిన ఓ స్వా మీజీ సహాయంతో క్షుద్ర పూజలు నిర్వహిం చి భస్మం చేస్తానంటూ హెచ్చరించాడు. మ రో ఐదు లక్షలు ఇస్తే బంగారం నిధి చూపిస్తానంటూ బుకాయించాడు. ఇలాగే మరో ఏడుగురితో గుప్తనిధుల వేట పేరుతో డబ్బు లు వసూలు చేయడంతో వారంతా ఏకమయ్యారు. ఎలాగైనా తనను హతమార్చాలని పథకం వేసుకున్నారు.
గత నెల 29 న హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన రంగసాని ఎంతకు తిరిగి రాకపోవడంతో ఈ నెల 4న కోడేరు పోలీస్ స్టేషన్లో భార్య అరు ణ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆసక్తికరమైన విషయా లు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ కాల్ రికార్డ్ ఆధారంగా అచ్చంపేట ప్రాంతానికి చెందిన పుల్లయ్య గౌడ్ ను అదుపులోకి తీసుకొని వి చారించగా విషయం బయటపడినట్లు డిఎస్పి తెలిపారు.
బల్మూరు మండలం మై లారం గ్రామంలోని పుల్లయ్య గౌడ్ సొంత పొలంలోనే హతమార్చి పూర్తి పెట్టినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలంలోనే తాసిల్దార్ వైద్యులతో కలిసి మృ తదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహిం చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.