calender_icon.png 29 August, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ పార్లమెంటులో బీజేపీ ఓటు చోరీ బాగోతాన్ని బయటపెడతాం

29-08-2025 02:48:34 AM

మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ 

డిసిసి అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, ఆగస్ట్28(విజయక్రాంతి): దేశ దేశవ్యాప్తంగా పలు లోక్ సభ నియోజకవర్గాలలో తమ ఓటు బ్యాంకు లేనప్పటికీ బిజెపి అభ్యర్థులు గెలవడం వెనుక రహస్యాన్ని బయటపెడుతూ ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ సహకారంతో ఒకే ఇంట్లో జీరో ఇంటి నెంబర్ పై 120 ఓట్లు ఉండడంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారని మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

ఓట్ చోరీ జరిగిన విషయాన్ని ఆధారాలతో నిరూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ బీహార్ లో ప్రారంభించిన ఓటర్ అధికార్ యాత్ర తో ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ నాయకులలో ఆందోళన మొదలైందన్నారు.

ఓట్ చోరీ వ్యవహారంతో నగ్నంగా దొరికిపోయిన మోడీ అమిత్ షాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లతో గెలిచిన బిజెపి నాయకులపై టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ప్రసంగిస్తూ కరీంనగర్ పట్టణంలో కూడా ఒక ఇంట్లో బిజెపికి 40 ఓట్ల పై సమాధానం చెప్పాలని, ఒక్క సీటు కూడా గెలవలేని కరీంనగర్ కార్పొరేషన్ లో ఇన్ని సీట్లు ఎలా గెలిచారని ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, దీనికి సమాధానం చెప్పలేని కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ , బిజెపి దద్దమ్మలు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని మండిపడ్డారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈడి, సిబిఐ, ఈసీ, న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని కానీ ఈ విధమైన చర్యల వల్ల బిజెపి ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం సంపాదించలేరని బండి సంజయ్ వారి అనుచరులు గ్రహించాలన్నారు.