calender_icon.png 29 August, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఎందులో తక్కువ?

29-08-2025 02:50:54 AM

  1. మహిళ చేతికి తాళం చెవి ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది
  2. మోదీ ఈ దేశ బడ్జెట్‌ను నిర్మల సీతారామన్ చేతిలో పెట్టారు
  3. ఆర్దిక ప్రగతిలో ప్రపంచంలోనే 4వ స్థానానికి చేర్చారు
  4. జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతి వినూత్న కార్యక్రమాలతో పాలన చేస్తున్నారు 
  5. అందుకే మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోలిస్తున్నాం
  6. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, ఆగస్ట్28(విజయక్రాంతి): మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమార్ అన్నారు. ఏ ఇంట్లోనైతే మ హిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందని. ప్రధాని నరేంద్రమోదీ 50 లక్షల 65 వేల కోట్ల రూపాయల దేశ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టడంవల్లే ఆర్ధిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతోందని 11వ స్థానం నుండి 4వ స్థానానికి చేరుకుందన్నారు.

దీనిని ద్రుష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల అభివ్రుద్దికి ప్రత్యేక ద్రుష్టి సారించారని తెలిపారు.  క రీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద 15 మంది నిరుపేద మహిళలకు కాలుష్యరహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ రూ.3.5 లక్షలు. ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయా రు చేశారు. స్టీల్ రూఫ్ తో తయారు చేసిన ఆటో డబుల్ స్పీకర్ ఎఫ్‌ఎం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

పెట్రోల్/డీజిల్ ఆటోల ఖ ర్చుతో పోలిస్తే 70 నుండి 80 శాతం తక్కువ ఖర్చు ఆదా అవుతుంది. మెయింటెనెన్స్ కూ డా చాలా తక్కువ. కార్పొరేట్ రెస్పాన్స్ బిలి టీ ఫండ్ (సీఆర్‌ఎఫ్) నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేసిన బండి సంజయ్ వా టిని నిరుపేద మహిళలకు అందజేయడం గమనార్హం. 15 మంది మహిళల్లో 10 మందికిపైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారే కావడం విశేషం.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు 2 నెలలపాటు ఉచితంగా శిక్షణనివ్వడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు అందించిన అ నంతరం నేడు ఆ మహిళలకు కలెక్టర్ పమే లా సత్పతి, మాజీ మేయర్ సునీల్ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సం జయ్ ఆటోలను పంపిణీ చేశారు. కొద్దిసేపు బండి సంజయ్, సునీల్ రావు ఆటోలో ప్రయాణించారు.