29-08-2025 01:09:10 AM
సెప్టెంబర్ 6 లేదా 10న కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక
మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్
గద్వాల, ఆగస్టు 28 : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మాజీ కౌన్సిలర్లు నాయకులు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గు రువారం గద్వాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసిందని, కార్యకర్తల మనోభావాలకు గౌరవం ఇవ్వక పోగా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిందని అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అంటూ బీసీల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఆయన తెలిపారు. గతంలో టిఆర్‌ఎస్ పార్టీ నుండి గెలిచిన స్థానిక శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా బిఆర్‌ఎస్ లో ఉన్నాడా అని విలేకరులు ప్రశ్నించగా దాని గురించి వచ్చే నెల ఆరవ తేదీన పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతానాని, అప్పుడు సినిమా చూపిస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ నేత అయిన సరితకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు ఈ మధ్యకాలంలో దాదాపుగా 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ గుర్తించలేదని, దానిపై ఇప్పటిదాకా ప్రశ్నించలేదని, మాట్లాడలేదని అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానన్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.