14-11-2025 12:08:37 AM
తెలంగాణ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘రాజు వెడ్స్ రాం బాయి’. అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీ ఒరిజినల్స్ ద్వారా ఈ చిత్రా న్ని రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు.
నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను ఈ నెల 21న థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో టీమ్ ప్రమోషన్స్‌ను బ్యాండ్‌బాజాలాగా మోగిస్తోంది. ప్రచారానికి తగ్గట్టుగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలతో ఈ సినిమాపై భారీ సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా మేకర్స్ గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు’ అంటూ ట్రైలర్ ఆరంభంలో పేర్కొన్న మాటతోనే ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది.
‘చేసుకోనంటెనేమో నువ్వు కొడ్తవ్.. చేసుకుంట అంటెనేమో ఆయన కొడ్తడు.. మీ ఇద్దరి పొత్తుల నేను చస్తున్న..’ అంటూ సాగే డైలాగులు కన్నతండ్రి, ప్రియుడి మధ్య నలిగిపోయే రాంబాయి కథ చివరకు ఎలా ముగిసిందో తెలుసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైల ర్ కట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి; సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్; ఎడిటింగ్: నరేశ్ అడుపా; ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్.