calender_icon.png 14 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం

14-11-2025 01:12:03 AM

యాచారం, నవంబర్ 13: ఈ సంవత్సరం నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం అనే వినూత్న  కార్యక్రమంలో భాగంగా గురువారం  మొండిగౌరెల్లిలో కేఎన్‌ఎం 1638 ఫౌండేషన్ విత్తన పంట పొలాలను డా. వాణిశ్రీ శాస్త్రవేత్త  పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పొట్ట దశలో ఉన్న వరి పొలంలో యూరియా అసలు వాడకూడదని తాలు గింజలు ఏర్పడే అవకాశము ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

యూరియా కూడా అధిక మోతాదు లో వాడొద్దన్నారు. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని వాడినపుడు దిగుబడులు కనీసం 10-15 శాతం వరకు పెరిగే  అవకాశాన్ని రైతులకు తెలిపారు.  రైతులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని కొన్ని సాగు సాంకేతికతలను పాటిస్తే అదే విత్తనాన్ని 2-3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అన్నారు.

ఈ విధంగా విత్తన సాంకేతికతను గ్రామ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా, రానున్న 2-3 సంవత్సరాలలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధిని సాధించడమే కాక, తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భద్రతలో దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రఘునాథ్, పలువురు రైతులు పాల్గొన్నారు.