25-08-2025 12:42:04 AM
ఇటీవల ‘అమరన్’ సినిమాతో మెప్పించారు శివకార్తికేయన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజ ర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ హ్యుజ్‌బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘నీలాగే ఇతరులను ప్రేమించు. అందరూ నీ కుటుంబమే అనుకో.
అదే అన్ని మతాలు, అందరి దేవుళ్లూ చెప్పేది’ అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమతుంది. శివకార్తికేయన్ పాత్ర అరుదైన మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా పరిచయం కావడం, తన స్థితి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయడం క్యురియాసిటీని మరింత పెంచుతుంది. ‘తన ఒంట్లో ఏమీ లేదమ్మా.. మెదడే.. తను తలుచుకుంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా వెళ్తాడు’ అనే డైలాగ్‌ను బట్టి శివకార్తికేయ లక్ష్య సాధన కోసం ఎంతదాకైనా వెళ్లాడనేది అర్థమవుతోంది.
తన ప్రియురాలిని కాపాడేందుకు జీవితాన్నే మార్చేసే నిర్ణయం తీసుకుంటాడనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. లేయర్స్ ఉన్న క్యారెక్టర్‌లో శివకార్తికేయన్ ఫెరోషియస్, ఇంటెన్స్‌గా కనిపించారు. రుక్మిణి వసంత్ గ్లామర్‌కే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రానుంది.