calender_icon.png 26 December, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుద్దిళ్ల సోదరుల గురించి మాట్లాడితే వీపు పగులుద్ది

26-12-2025 02:42:58 AM

  1. అభివృద్ధి చూసి ఓర్వలేని నీకు మతి భ్రమించింది

ఆ చెక్ డ్యామ్ నీ అనుచరులే పేల్చినట్టు అనుమానం ఉంది

కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలనే నీ నీచ రాజకీయం మానుకో..

మంథనిలో విలేకరులతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్

మంథని, డిసెంబర్25(విజయ క్రాంతి) దుద్దిళ్ల సోదరుల గురించి మాట్లాడితే ఈపు పగులతది బిడ్డ పుట్ట మధు అని, మంథని అభివృద్ధి చూసి ఓర్వలేని నువ్వు మతిభ్రమించి మాట్లాడుతున్నావని  బుధవారం పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంథని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, సర్పంచులు ఆర్ల నాగరాజు,

గట్టు దామోదర్, జాడి రామస్వామి, ఎస్సీ సెల్ డి విజన్ అధ్యక్షులు మంథని సత్యం నాయకులు మాట్లాడుతూ అరె ఓ పుట్ట మధు అన లేక కాదు... నీతి నిజాయితీ నేర్పించిన నాయకుడు మా మంత్రి శ్రీధర్ కాబట్టి మే ము నిన్ను ఏకవచంతో సంబోధించడం లేద ని,నువ్వు ఇసుక మాఫియా నడిపించిన గత ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తిపడి ఇసుక లారీల కమిషన్లతో కక్కుర్తి పడ్డారని ధ్వజం ఎత్తేరు.

నువ్వు ఇసుక మొత్తం తీసి పునాది కడితేనే చెక్ డ్యాములు దృఢంగా ఉంటాయని, అది ముందు తెలుసుకో, నాణ్యతలేని చెక్ డ్యాంలు కట్టి ప్రభుత్వాన్ని వేలాది కోట్ల నష్టానికి గురి చేసిన గత ప్రభుత్వ పాలకులు ఇక మీరు మాట్లాడుతున్నారా. సిగ్గు లేకుండా ఇకనైనా మారండి రా అన్నారు.మంత్రి శ్రీధ ర్ బాబు చెక్ డ్యాం లను వ్యతిరేకించ లేదని, అశాస్త్రీయంగా, నీ కమీషన్ ల కోసం, నాణ్య తా లోపంతో, నీ అనుచరులు, నీ బినామీదారులు కట్టిన చెక్ డ్యాం వ్యతిరేకించిండు. నీ పేరు భయటికి వస్తుందన్న భయంతోని నువ్వు మొరుగుతున్నావు. ఈ విషయం అం దరికి అర్ధం అయ్యిందన్నారు.

నీ అనుచరులతో నువ్వు నాన్యతలేకుండా కట్టినావ్ కను కనే ఆ చెక్ డ్యాం కూలిపోయిందని, చెక్ డ్యాం లను శ్రీరాంనగర్, ఏల్లంపల్లి ప్రాజెక్ట్ లతో పోల్చినప్పుడే అర్ధమయ్యిందని, నీ మె దడు మోకాల్లలో ఉన్నదని.70 ఏండ్లలో కాంగ్రెస్ కట్టించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూలిపోలేదని, 10 ఏండ్ల పాలనలో మీరు కట్టిన ప్రా జెక్టులు, వంతెనలు చివరికి చెక్ డ్యాం లు కూడా కూలి పోతున్నాయని, మంథని ప్రజ లు అన్నీ చూస్తున్నారని, అందుకే నీకు ఛీ కొడుతున్నారు.

బలహీన వర్గాలను అంబేద్కర్ ను అడ్డంపెట్టుకుని బ్రతుకుతున్న బ్రో కర్ వి నువ్వని, బాబా సాహెబ్ ప్రశ్నించ మన్నాడని, నీలాగా భూతులు మాట్లాడమనలేదని, బాబా సాహెబ్ పోరాడమన్నాడు, నీలాగా బెదిరించ మనలేదని, బాబా సాహెబ్ అణగారిన వర్గాల అభ్యున్నతిని కోరుకున్నాడని నీలాగా కోట్లకు పడిగెత్తలేదన్నారు.

దొంగే ...దొంగా దొంగా అన్నట్టు 

5 ఏండ్ల అధికారానికే వందల ఎకరాలు, కోట్ల విలువైన రాజమందిరాలు కట్టుకున్న అవినీతి పందివని, నువ్వు శ్రీధర్ బాబు అవినీతి పరుడని ఆరోపిస్తే బుద్ది, జ్ఞానం ఉన్నవారెవ్వరూ నమ్మరని, మంథని సమా జం ఇవాల నిన్ను చూసి సిగ్గుపడుతుందని, పూలవనం లో గంజాయి మొక్కలాగా మే ధావుల గడ్డలో నీ లాంటి లుచ్చాగాడు పుట్ట డం మా దురదృష్టమని, నీకు చదువులేదు చదువుకున్నవాల్లని గౌరవించే ఇంగితం అంతకన్నా లేదని,చెక్ డ్యాంలు పిట్టలకు, జంతువుల కోసం కాదు రా చేపలు ఉత్పత్తి అని అంటున్నావ్ అరె మధు తెలివి ఉండి మాట్లాడు రా సన్యాసి.

మా యువ నాయకులు శ్రీను బాబు గురించి మాట్లాడుతు న్నావ్ గవర్నమెంట్ మెడికల్ సిట్ లు అ మ్ముకున్నారని మాట్లాడుతున్నావ్ అరె మ ధు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సిట్లు అమ్ముకునుడు ఉండదురా ఆంధ్రజ్యోతిలో ప్రచురణమైనది వక్రీకరించి కార్మికుల పని భారం అని మాట్లాడితే సీట్లు అమ్ముకున్నా రు అని మాట్లాడుతున్నావ్ జాగ్రత్త బిడ్డ మ ధు.మంథని చెక్ డ్యాం ఎస్టిమేషన్ డబుల్ చేసి కోటి రూపాయలు మింగింది నువ్వు కాదా...

నీ జేబులు నింపుకోవడం కోసం తప్ప మంథని చెక్ డ్యాం ఏ రైతుకు అన్నంపెట్టిందో చెప్పురా దద్దమ్మా.5 సార్లు ప్రజలు గుండెల్లో పెట్టుకున్న శ్రీధర్ బాబును తెలివి తక్కువ దద్దమ్మ అంటున్నావు. మంథని ప్ర జలకు ఏది పంది ఏది నంది బాగా తెలుసు. నువ్వు పందివి కనుకనే 20 సంవత్సరాల నుండి నంది లాంటి శ్రీధర్ బాబును గుండె ల్లో పెట్టుకున్నారని,అదృష్టవశత్తు గెలిచిన పుట్ట మధు ఒక్కసారి గెలిపించినందుకే ఎ న్నోనిండు ప్రాణాలను తీశావని, వామనరావు దంపతులను చంపించినావ్, మంథని మధుకర్ హత్యను ఆత్మ హత్యగా చిత్రికరించావని,

రంగయ్య పోలీసు స్టేషన్ లో చని పోతే బలవంతంగా రాజీ చేయించావని, మంథని చెక్ డ్యాంలో ఖమ్మంపల్లి చెక్ డ్యాం లో చనిపోయిన వాళ్లకు అన్యాయం చేసిన నువ్వు ఇంకా సిగ్గులేకుండా ఏ ముఖంతో ప్రశ్నిస్తున్నవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోలు శివ, మా ర్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాం త్,

మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీని వాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుడద శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారి శంకర్, సర్పంచులు కన్నూరి రాజబాబు, భూగోండ స్వరూప రవి, తోట పోచయ్య, మెరుగు సురేష్, గుమ్మడి సమ్మయ్య, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, మాజీ ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.