calender_icon.png 26 December, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం గర్వించే నేత వాజ్‌పేయి

26-12-2025 02:43:36 AM

సికింద్రాబాద్/కంటోన్మెంట్ :  దేశం గర్వించే నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండా రు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యం లో పికెట్‌లోని జేబీఎస్ అటల్ బిహారీ వాజ్‌పేయి పార్కులో గురువారం ఆయన 101వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అటల్ జీవితం రాజనీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, కవిత్వం, అచంచలమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిందని, భరతమాత గర్వించే ముద్దుబిడ్డ వాజ్‌పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ కార్తీకా చంద్రారెడ్డి, కంటో న్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొ రేటర్లు సుచిత్ర, దీపిక, బీజేపీ నేత రాయల్ కుమార్ పాల్గొన్నారు.