calender_icon.png 4 July, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ లబ్ధిదారుల వేలిముద్ర ఒకచోట.. సన్నబియ్యం పంపిణీ మరోచోట

03-06-2025 10:26:26 PM

పట్టించుకోని రెవెన్యూ అధికారులు..

తూప్రాన్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే వర్షాకాలంలో రేషన్ లబ్దీదారులకు ఇబ్బందులు కలకుండా ఉండడానికి మూడు నెలల రేషన్ బియ్యం ఇప్పటికే డీలర్లకు దుకాణాలలోకి చేరడం జరిగింది, నిన్నటి నుండి రేషన్ బియ్యం లబ్దీదారులకు మెదక్ జిల్లా(Medak District) వ్యాప్తంగా అందజేస్తున్నారు. తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ఒక రేషన్ దుకాణంలో వేలిముద్ర తీసుకొని మరో స్థలంలో బియ్యం పంపిణీ మున్సిపల్ లో చోటుచేసుకుంది.

ఆన్లైన్ లో ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలు లేదా మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా నిర్ధారణ చేసుకుని లబ్దిదారులకు బియ్యం ఇవ్వాల్సి ఉండగా వేలిముద్రలు ఒకచోట  తీసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో బియ్యం పంపిణీ చేయడం విడ్డూరంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ రేషన్ డీలర్ ల నిర్వాకం, ఇలా పంపిణీ చేయడంలో అసలు సంగతేమిటి దీనిపై రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని మున్సిపల్ పరిధిలోని రేషన్ దుకాణాలను తనిఖీలు నిర్వహించాలి, అర్హులైన రేషన్ లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందేలా చూడాలని రేషన్ కార్డు లబ్ధిదారులు తెలిపారు.