calender_icon.png 12 October, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస కార్మికులను పట్టించుకోకపోవడం దుర్మార్గం

11-10-2025 12:00:00 AM

మాజీ మంత్రి హరీశ్ రావు  

హైదరాబాద్, అక్టోబర్10(విజయ క్రాం తి):  ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కు కున్న 12 మంది వలస కార్మికుల ఆవేదన ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మా ర్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిప డ్డారు. కాంగ్రెస్ పాలనలో గల్ఫ్, ఎన్నారై పాలసీలకు  అతి, గతి లేదని విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుం డటం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు శుక్రవారం ట్విట్ట ర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదని ఆరో పించారు. 

కమిటీ ఏం చేస్తున్నదని, గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇప్పటికీ దిక్కులేదని తెలిపారు.