calender_icon.png 12 October, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసైన్డ్ భూములు అన్యాక్రాంతం

11-10-2025 12:06:36 AM

  1. అడ్డగోలు నిర్మాణాలు... అనుమతులు శూన్యం 

ఓ అధికారి భారీ నిర్మాణం 

చోద్యం చూస్తున్న అధికారులు 

భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 10 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచ పట్టణ పరిధిలోని అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంత మవుతున్నాయి. ప ట్టణం, మండలంలో 3 వేల ఎకరాలతో విస్తరించిన ప్రభుత్వ సర్వే నెంబర్ 817 అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కె ఎల్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు తెరలేపారు.

ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా చేపట్టిన నిర్మాణాలపై రెవెన్యూ మున్సి పల్ ప్రభుత్వ శాఖల యంత్రాంగం చోద్యం చూస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పం దించకపోవడం గమనార్హం. 

817లో వాలిన భూ గద్దలు 

రియల్ ఎస్టేట్ పేరుతో ఈ భూమిపై రియల్ దందా వ్యాపారులు కన్నేశారు.  బా హాటంగా భూ అక్రమాలకు పాల్పడి వెంచర్ల తరహాలో కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన భూ వివాదం స్థానిక శాసనసభ్యులు దృష్టికి వెళ్లడం, పోలీసులు ఓ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీ రెత్తినట్లు వ్యవహరిస్తుంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి నట్లు ఆరోపణలు వెలవడుతున్నాయి. 

భారీ మొత్తంలో ముడుపులు?

వివాదాస్పదమైన 817 సర్వే నెంబర్లు అనధికారికంగా వెంచర్లు, అక్రమ నిర్మాణా లు చేపట్టిన అధికారులు స్పందించకపోవడం అక్రమార్కుల నుంచి అధికారులకు న జరాణాలు పెద్ద మొత్తంలో ముట్టినట్లు ఆరోపణలు ధ్రువపరుస్తున్నాయి.

టీఎస్ జెన్కోకు చెందిన ఏ డి ఈ స్థాయి అధికారి ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఇంటి నిర్మాణం చే పట్టిన అంశాన్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన అటువైపు కన్నెత్తి కూడా చూడటం లే దంటే విషయం ఇప్పటికే అర్థమయి ఉం టుంది.

జిల్లా కలెక్టర్ కల్పించుకొని 817లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిరక్షించాలని పాల్వంచ పట్టణ మండల ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ కుమార్ ను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు.