calender_icon.png 23 May, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంగయ్యపై అక్రమ కేసు సరికాదు

21-05-2025 12:26:51 AM

  1. అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గురించి ప్రశ్నినిస్తే కేసులా?

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను బహిరంగంగా కానీ సోషల్ మీడియా వేదికగా గాని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కేసులు పెట్టి భయపెట్టాలి అనుకోవడం సిగ్గుచేటు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న విద్యార్థి నేత బిఆర్‌ఎస్వి రాష్ట్ర కార్య దర్శి జంగయ్యపై అక్రమ కేసు బనాయించిన తరుణంలో సోమవారం బషీర్బా గ్ లోని సీసీఎస్ పోలీసుల ఎదుట బిఆర్‌ఎస్ పార్టీ లీగల్ సెల్ వారితో కలిసి హాజరయ్యారు.

అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ మాట్లాడు తు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా తప్పులను ప్రశ్నించే విద్యార్థులపై 352 యాక్ట్ ప్రయోగించరాదని సుప్రీం కోర్ట్ తీర్పునప్పటికీ వాటిని తుంగలో తొక్కి విద్యార్థులపై 352 యాక్ట్ ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని అన్నారు.

బీఆర్‌ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగ య్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి, యువ భరోసా కార్డు, రెండు లక్షల ఉద్యోగాలు, ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల గురించి ప్రశ్నిస్తే? పెండింగ్ స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అడిగితే కేసులా? లేక మహిళలకు ఇస్తానన్న 2500 మహిళా భరోసా, పింఛన్ల పెంపు, వరి ధాన్యానికి బోనస్, రైతుబంధు గురించి రైతుల పక్షాణ కొట్లాడితే కేసులా?

తులం బంగారం అడిగినందుకు, హైడ్రాతో ఆగమైన పేదల బతుకులు పక్షాన ప్రశ్నిస్తు న్నందుకేనా? కాంగ్రెస్ పాలనలో సాగని సంక్షేమం ఆగిన అభివృద్ధి గురించి కొట్లాడుతున్నందుకేనా? ఈ అక్రమ కేసులా అని ప్రశ్నించారు.. ఎన్ని కేసులు పెట్టినా జైల్లో నిర్బంధించిన ప్రజల పక్షాన పోరాటం ఆగదని జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.