calender_icon.png 22 May, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌లో అందగత్తెలు

21-05-2025 12:29:33 AM

-రొమ్ము క్యాన్సర్ చికిత్సకు కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్‌కు ప్రశంసలు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ‘ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్’ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. వీరికి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు.

గత 18 సంవత్సరాల్లో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌం డేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను మిస్‌వరల్డ్ పోటీదారులు కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణుల ను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ.. డాక్టర్ రఘురామ్ దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు. 

డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నా మని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశం లో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ.. డాక్టర్ రఘురామ్ చేపట్టిన ప్రతి పని 100 శాతం విజయాల రేటుతో చేస్తున్నారని చెప్పారు.

కిమ్స్- ఉషాలక్ష్మి సెం టర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మిబ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ.. కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలి యా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణ మే తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వ సహకారా నికి కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృ త్వం వహించారు. ఆ బృందంలో నందిని గుప్తా (మిస్ ఇండియా), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్), ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్‌ఏ) ఉన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ పాల్గొన్నారు. డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం తన అదృ ష్టమని చెప్పారు.