09-05-2025 02:14:03 AM
-బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): దేశంలో ఉన్న అక్రమ చొరబాటుదారులపై కేంద్రప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవ హరించకుండా దయచూపిందని, అందుకే ఉగ్రవాద ఘటనల ద్వారా మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందన్నారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నివేది క ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అక్రమ వలసదారులను, వీసా గడువు ముగిసి ఇక్కడే జీవిస్తున్న విదేశీయులను, పాకిస్థాన్‌కు చెంది న వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాలన్నా రు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.