calender_icon.png 16 September, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలి

16-09-2025 12:00:00 AM

వనపర్తి, సెప్టెంబర్ 15 ( విజయక్రాంతి ) : మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో గొల్ల కుంటలో చేపడుతున్న అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలి డిమాండ్ చే స్తూ రేమద్దుల వాల్యా నాయక్ తండా గ్రామస్తులు రైతులు సోమవారం తహసిల్దా ర్ సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. అక్రమ మైనింగ్ పై గతంలో కూడా ఫి ర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా స్పందించి గొల్ల కుం టలో సర్వేనెంబర్ 243గల 6.35గుంటల శిఖం భూమిని ధ్వంసం చేసి ప్రభుత్వం నుం చి ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ మైనింగ్ చేపడుతున్నారని తెలిపారు. వెంట నే అక్రమ మైనింగ్ను నిలుపుదల చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.