29-10-2025 11:45:16 PM
ఆల్మట్టి ఎత్తు పెంచితే.. కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవాల్సిందే
మంచి కాదు పేరు కోసం సీఎం రేవంత్ రెడ్డి తల్లాడుతుండు
బీఆర్ఎస్ తో పార్టీతో నాకు సంబంధం లేదు
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఏ లక్ష్యం కోసమైతే స్వరాష్ట్ర ఉద్యమంలో బాట పట్టామో ఆ లక్ష్యం నేటికి నెరవేరలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన పేరు కోసమే తనలాడుతున్నారని ప్రజలకు మంచి చేయాలని తపన అతనికి లేదని విమర్శించారు. సొంత పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? బీజేపీ పార్టీల ఉన్నారా? తెలియని పరిస్థితిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కొడంగల్ ప్రాజెక్టు కట్టుకోవడంలో ఇబ్బంది లేదని, అంతకుముందు ప్రారంభమై చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఏపీ ప్రభుత్వం మన నీళ్లను తీసుకెళ్తుంది.. ఇప్పటికే కృష్ణా బేసిన్ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. గోదావరి నీళ్ల కోసం బనకచర్ల కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే ప్రయత్నం కూడా జరుగుతుంది. చుక్క నీరు రాదని మహబూబ్ నగర్ ప్రజలకు చెబుతున్నా. దీన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి వేయాలన్నారు. ముఖ్యమంత్రి పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకుంటారు. రెండేళ్లలో మహబూబ్ నగర్ టౌన్ కు ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి తప్ప మళ్లీ రాలేదని, మహబూబ్ నగర్ టౌన్ కు కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేస్తారా లేదా చెప్పండని ప్రశ్నించారు. పదేళ్ల క్రితమే నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేశామని చెప్పారు.
ఇప్పటికీ మహబూబ్ నగర్ లో మూడు రోజులకొకసారి నీళ్లు వస్తాయని స్థానికులు చెబుతున్నారని, బీఆర్ఎస్ తప్పా. కేసీఆర్ తప్పా అనేది ఇక్కడ చర్చ కాదని లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేస్తే మంచి పేరు వస్తుందని సీఎం గారికి సూచిస్తున్నా. కేవలం కేసీఆర్ కు మంచి పేరు వస్తదనే ఉద్దేశంతో పనులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకండి, నారాయణ పేట్ కొడంగల్ ప్రాజెక్ట్ కూడా కట్టుకోండి. కానీ 80 శాతం పనులు పూర్తైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయండి. లేదంటే ఏపీ ప్రభుత్వం మన నీళ్లను తీసుకెళ్తుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్ల కోసం బనకచర్ల కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే జరిగితే కృష్ణా ప్రాజెక్ట్ ల కాల్వల్లో క్రికెట్ ఆడుకోవాల్సిందే. చుక్క నీరు రాదని మహబూబ్ నగర్ ప్రజలకు చెబుతున్నా. దీన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి వేయాలి.
ఇష్టనుసారంగా మాట్లాడుతుండ్రు...
జడ్చర్ల జుడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్రెడ్డికి మంచి పీఆర్ ఫ్రంట్ లు ఉన్నాయని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇక్కడి సెజ్ ముచ్చట రాగానే ఫోటోలకు ఫోజులు ఇస్తారు. కానీ గతంలో మాట ఇచ్చినట్లు కొల్లూరు మండలం తేవాలని, జడ్చర్ల ప్రభుత్వ మాహాస్పెటల్ ను మళ్లీ 100 పడకల హాస్పిటల్ గా చేయాలని, వైద్యం అందక చనిపోయిన యువరైతుకు పరిహారం అందివ్వాలసని డిమాండ్ చేశారు. ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతర్లీనంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని అవన్నీ చెప్పలేనని గత పదివేలుగా అవార్డుని అనుభవించి ప్రజలకు మంచి చేయాలని తప్పతో బయటికి వచ్చారని తెలిపారు. ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని సాధించేవరకు వదిలే ప్రసక్తి లేదని ప్రజలు ఎక్కడిది చూసిన బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ అంటే ప్రజలకు మంచి చేయడం తప్ప మరోటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.