calender_icon.png 30 October, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ బాధితులను ఆదుకోండి

29-10-2025 11:25:46 PM

కార్యకర్తలకు పిలుపు

రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్ (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావిత బాధితులకు సహాయం అందించాలంటూ బీజేపీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటనను విడుల చేశారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంతోపాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలకు అందగా నిలబడి, పేదలు, రైతులు, దినసరి కూలీలు వంటి జీవనోపాధి కోల్పోయిన వారికి తక్షిణ సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో కార్యకర్తలు సమన్వయం చేసుకుని అవసరమైన చోట ఆహారం, పునరావాసం, వైద్య సహాయం చేయాలని ఆయన కోరారు.