calender_icon.png 1 November, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో ఈ రోడ్డుపై వెళ్లేదెలా.?

01-11-2025 08:16:57 AM

పోలీస్ స్టేషన్ దారి బురదమయం. 

నిత్యం వాహనదారులు ఇబ్బందులు 

పదర: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రోడ్డు ఇప్పట్లో బాగుపడేలా లేదని స్థానిక ప్రజలు, మండల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. బురద మయం అయినప్పుడల్లా అడపా దడపా మొరం వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం పడిన వర్షానికి రోడ్ అంతా చిత్తడిగా మారడంతో పోలీస్ స్టేషన్, రైతు వేదిక వద్దకు వెళ్లడానికి వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రోడ్డుపై వాహనదారులు రాకపోకలను మానేసిన, స్థానిక ప్రజలకు మాత్రం కాలినడక ఇక్కట్లు తప్పడం లేదు. ఈ మార్గంలో సీసీ రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు పలుసార్లు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు.