31-10-2025 02:04:44 AM
 
							- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ నష్టం
- సీఎంను పర్యటించాలని కోరిన మంత్రి పొన్నం
- పంట నష్టంపై కేంద్ర మంత్రి బండి ఆరా
కరీంనగర్, అక్టోబరు 30 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో మొంథ తుఫా న్ రైతును నిలువునా ముంచింది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో హుజురాబాద్, హుస్నాబా ద్ నియోజకవర్గలలో భారీ నష్టం వాటిల్లిం ది. చేతికి వచ్చిన పంట వరదనీటిలో కొట్టు కుపోగా, కోతకు వచ్చిన పంట నీట ముని గింది. కరీంనగర్ జిల్లాలో 183 గ్రామాల ప రిధిలోని 3,321 మంది రైతులకు సంబం ధించిన 3,512 ఎకరాల్లో పత్తి చేన్లు తడిసి ముద్దయ్యాయి.
ఇందులో అత్యధికంగా కొ త్తపల్లి మండలంలో 1200 ఎకరాల్లో, ఇల్లం దకుంటలో 300, జమ్మికుంటలో 200, సై దాపూర్లో 324 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. జిల్లాలోని 15 మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 26, 441 మంది రైతులకు సంబంధించి 30, 560 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. మండలాల వారీగా చూస్తే హుజురాబాద్లో 3959, సైదాపూర్లో 4123, ఇల్లందకుంటలో 1200, జమ్మికుంటలో 1400, వీణవంకలో 1650, శంకరపట్నంలో 2100, మానకొం డూర్ 3800, తిమ్మాపూర్ 240, చిగురు మామిడిలో 3383, గన్నేరువరంలో 1740, కరీంనగర్ రూరల్ మండలంలో 2055, కొత్తపల్లిలో 2500, చొప్పదండిలో 550, రామడుగులో 175, గంగాధరతో 1650 ఎక రాల్లో వరిపంట దెబ్బతింది. మొక్కజొన్న చొప్పదండి మండలంలో 50 ఎకరాల్లో దెబ్బతింది. మొంథ తుఫాన్ కు సంబంధిం చి రైతాంగం అరబెట్టిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా అష్టకష్టాలు పడ్డా ఫలితం లేకుండా పోయింది.
- తడిసిన 11644 క్వింటాళ్ల ధాన్యం
భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అ మ్మకానికి తీసుకువచ్చిన వరిధాన్యం బస్తా లు తడిసిపోయాయి. చాలా చోట్ల రైతులు రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం వరదకు కొ ట్టుకుపోయింది. అధికారుల అంచనా ప్రకా రం కరీంనగర్ జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 4684 క్వింటాళ్లు, డీసీఎంఎస్ కేంద్రాల్లో 6690 క్వింటాళ్లు, హకా పరిధి లోని కొనుగోలు కేంద్రాల్లో 270 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మొత్తం 11,644 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది.
------సీఎంను పర్యటించాలని కోరాను : -మంత్రి పొన్నం ప్రభాకర్-
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కుంటుంది.దెబ్బతిన్న రోడ్లను ,కల్వర్టులను , దెబ్బతిన్న పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించాం..హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది..పూర్తిగా జలమయం అయింది.. రై తాంగం పూర్తిగా నష్టపోయారు.వేలాది ఎక రాల్లో ధాన్యం దెబ్బతింది.. కొట్టుకుపో యింది.. రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయి. హు స్నాబాద్ లో పర్యటించాలని ముఖ్యమంత్రి ని విజ్ఞప్తి చేశాం.రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుంది.కేంద్ర మంత్రి బం డి సంజయ్ రాజకీయాలకు అతీతంగా రై తాంగాన్ని ఆదుకోవాలి..ఇక్కడ పర్యటించా లి. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ప్ర భుత్వం బాధ్యత గా రైతులను ఆదుకుం టాం చరిత్రలో ఇక్కడ ఇంత వర్షం ఎక్కడ ప డలేదని చెబుతున్నారు.వరదలు వచ్చినప్పు డు అధికారులు ప్రజల మధ్యే ఉండి నష్ట పోయిన పంటలను అంచనా వేయాలని, భారీ వరదలకు జరిగిన నష్టాన్ని మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించాం-
కేంద్ర మంత్రి బండి ఆరా
----కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వర్ష న ష్టంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు.ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.బాధిత ప్రాంతా ల్లో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నేతలకు పిలుపునివ్వగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యతించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జూపా కలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రి ష్ణారెడ్డిపర్యటించారు.
కొనుగోలు సెంటర్లలో చేరిన నీరు
రాజన్నసిరిసిల్ల, అక్టోబర్ 30 (విజయక్రాంతి): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 178 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి పంట ఎ క్కువగా నేలవాలటం మూలంగా నష్టం జరిగినట్లు ఆదికారులు తేల్చారు.ముస్తాబా ద్ మండలం ఆవునూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ లోకి నీరు చేరడంతో ధాన్యం తడిసి మొలకలొచ్చాయి.ఇరిగేషన్ అధికారులు చెరువులోని నీటిని గేట్లు ఎత్తి కిందికి వదిలా రు.జిల్లాలోని పలు కొనుగోలు సెంటర్లను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ పరి శీలించారు.
వర్షం తగ్గిన తర్వాత ధాన్యం అరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. కొనరావుపేట మండలంలోని నిజామాబాద్ శివారులోని గద్దెగట్టు చెరువుకు ఎగువన పడిన వర్షం నీరు వచ్చి చేరడంతో బుంగప డింది.నిమ్మపల్లి గ్రామంలోని రైతు పెంతల మహేందర్ కు చెందిన పదేకాల పంట ధాన్యాని కోనుగోలు కేంద్రంలో అరబెట్టుకో బెట్టుగా ధాన్యం మొత్తం తడిసిముద్దైయ్యా యి. నిజాంబాద్ కోనుగోలు కేంద్రంలోని పలువురి రైతులు ధాన్యం కొట్టుకుపోయిం ది.నిమ్మపల్లి ప్రధాన రహదారి పెంటివాగు కాజ్ వే కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపో యాయి. పంటపొలాలన్ని నేలవాలి నీటము నిగింది. కొనరావుపేట మండలంలోని మూలవాగు ఉదృతంగా ప్రవహించడంతో మండలంలోని పలు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి.
తంగళ్లపల్లి మండలంలోని కస్బెకట్కూర్ చింతలపల్లి గ్రామంలో కొనుగోలు సెంటర్లో 25 మంది రైతులకు చెందిన ధాన్యం నీటి మునిగింది. దాచారం గ్రామ శివారులోని బానప్ప చెరు వు గండిపడడంతో పక్కనే ఉన్న రామ చంద్రాపూర్ గ్రామంలోని పంట పొలాలు నీటి మునిగాయి.30 01 తంగళ్లపల్లి మండ లం చింతలపల్లి గ్రామంలో నీట మునిగిన ధాన్యం కుప్పలు.30 02 తంగళ్లపల్లి మం డలంలోని దాచారం గ్రామంలోని బాణప్ప చెరువు తెగడంతో పొలాల్లోకి చేరుతున్న నీరు.30 కొనరావుపేట మండలం నిమ్మపెల్లి ప్రధాన రహదారి పై కొట్టుకుపోయిన కాజ్ వే 30 04 కొనరావుపేట మండలం నిమ్మ పల్లి కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసి న ధాన్యాన్ని చూపుతున్న రైతు దంపతులు
రైతన్నల ఆశలు ఆవిరేనా....
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతన్న ఆశలు ఆవిరేనా. ఖరీఫ్ వరి పంట పొలాలు కోతలు ప్రారంభ మై సుమారు 20 రోజులు గడుస్తున్న అధి కారులకు ప్రజాప్రతినిధులకు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పట్టించుకున్న నాధుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని తంగళ్ళపల్లి ముస్తాబాద్, వీర్నపల్లి ఎల్లారె డ్డిపేట, బోయిన్పల్లి, రుద్రంగి చందుర్తి, కోనరావుపేట్, గంభీరావుపేట్, ఇల్లంతకుం ట, ఇలా అన్ని మండలాల్లో వరి పంట వేశా రు. అన్ని గ్రామాలలో 20 రోజుల క్రితమే కోదలు మొదలయ్యాయి. గత వారం రోజు ల నుండి మొంత తుఫాన్ ప్రారంభంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షంతో పాటు చిరుజల్లు కురుస్తూనే ఉన్నా యి.
దీంతో వరి పంట కోసిన రైతన్నలకు కొనుగోలు చింతల ప్రభుత్వం రైతులకు ఉ చితంగా అందించాల్సిన టార్పాలిన్ కవరు లేక వరి ధాన్యం తడుస్తూనే ఉన్నాయి. కొన్ని మండలాల్లో సెంటర్లో ఖాళీ స్థలం లేక ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి రోడ్లపై రహ దారి వెంట కుప్పలుగా పోశారు. 20 రోజుల క్రితం వరి పంట కోసినప్పటికీ ప్రభుత్వం కొ నుగోలు సెంటర్ రోగత వారం క్రితం నుండే ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల్లో హడావిడి చేశారు. ప్రస్తుతం ఇంకా కొనుగో లు సెంటర్ ప్రారంభించకపోవడంతో ఇప్ప టికీ అన్ని మండల లో ఎక్కడ కూడా వర్ధా న్యం తూకం వేసి ధాన్యాన్ని రవాణా చేసిన దాఖలాలు లేవు. వర్ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తూకం వేసినట్లయితే సెంట ర్లో భారీగా ధాన్యం కుప్పలు నిల్వలు తగ్గిపో యేవి.
తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని రైతులకు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు... అటు సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని వెంట వెంట నే కొనుగోలు చేసి రవాణా చేయాలని ఆదే శాలు జారీ చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరతునట్లు వ్యవహరించడంతో రైతుల ఆరుకాలం కష్టం నీళ్ల పాలు అయింది. రైతులు ఆలస్యం గా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రారం భం పై మండిపడుతున్నారు. ఇప్పటికైనా తుఫాను ప్రభావం ఉన్నందున వరి ధాన్యం వెంట వెంటనే కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకో వాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆందోళనకు వద్దు.. ఆదుకుంటాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,అక్టోబర్30(విజయక్రాంతి):అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అ న్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గంగాధర, మంగపేట, ఇస్లాంపూర్ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేం ద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏ ర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్రాల కు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంట నే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళ నకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పిం చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి,సింగ ల్ విండో చైర్మన్ దూలం బాల గౌడ్, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, తాసిల్దార్ అంబటి రజిత,ఎండివో రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దు బ్బాసి బుచ్చయ్య,పడాల రాజన్న, సాగి అజ య్ రావు, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, కరుణాకర్, చందు, మధు, రాచమల్ల భాస్కర్,మంత్రి మహేందర్, శ్రీనివాస్, గంగాధర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.