calender_icon.png 19 November, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం కోటి 61 లక్షలు

19-11-2025 07:52:53 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం నాడు చిత్రకుట మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత భద్రత మధ్య లెక్కించారు. వివిధ హుండీల ద్వారా స్వామివారికి కోటి 61 లక్ష ల రెండువేల 694 రూపాయలు వచ్చింది. అంతేకాకుండా 141 గ్రాముల బంగారం 800 గ్రాముల వెండి కూడా ఉండి ద్వారా లభించింది.

వీటితోపాటు 347 అమెరికా డాలర్లు, 31 సింగపూర్ డాలర్లు, 30 కొరియా డాలర్లు 11 సౌత్ కొరియా వాన్స్, 2 మలేషియా రింగ్ గన్స్ తో పాటు మరో 125 డాలర్స్ వివిధ దేశాలకు చెందిన నగదు లభించింది. లెక్కించిన నగదును భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్ రావు దేవస్థానం అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అందజేసి స్వామివారి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు శ్రావణ్ కుమార్ రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.