04-09-2025 12:59:42 AM
కాప్రా చెరువును సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఉప్పల్, సెప్టెంబర్3 (విజయక్రాంతి) ఉప్పల్ నియోజకవర్గంలోని వినాయకుల నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్ల పై ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువును సందర్శించారు. నిమర్జనం ఏర్పాట్లును పై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం లోకాప్రా కన్వీనర్ రేగళ్ల సతీష్ రెడ్డి ఎమ్మెల్యే శాలువతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు , కాప్రా డివిజన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పీసరి మల్లారెడ్డి, శ్రీరాములు, నాగరాజు గుప్తా, శివరామకృష్ణ,పవన్, సరిత, భానుమతి,అమిత్ ,సురేష్ నాయక్, జై నీ రాజేశ్వర్ గుప్తా,బిక్షపతి గౌడ్, రోషన్, సరిత, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.