04-09-2025 12:57:54 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా మండలాలలో ఎక్కడి రోడ్డు అక్కడ కోతలు పడడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ సి ఈ రామ్ మోహన్ రావు, ఎస్ ఈ బావన్న , ఈ ఈ ఎన్ దుర్గాప్రసాద్, కామారెడ్డిడి ఈ స్వామి దాస్, ఎల్లారెడ్డి డి ఈ గిరి, లు కలిసి తమ సిబ్బందితో రాత్రి అనకా పగలనక ఆయా మండలాలలో తెగిపోయిన రోడ్లను తిరిగి మరమ్మత్తులు చేపడుతున్నట్లు వారు తెలిపారు.
పూర్తిస్థాయిలో మరమ్మతులకు ఇంకా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వాటికి అనుమతి రాగానే వాటిని కూడా పూర్తి చేస్తామని వారు తెలిపారు. యధాత ధంగా రవాణా సౌకర్యాలు జరుగుతున్నట్లు వారన్నారు. వారం రోజులుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రమించి తెగిపోయిన రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చే పడుతున్నట్లు తెలిపారు. సిబ్బంది సంజయ్, నరేష్, సందీప్, రోడ్లను తిరిగి పునరుద్ధరిచ్చినట్లు అధికారులు తెలిపారు.