04-09-2025 01:00:37 AM
ఎమ్మెల్యేకు బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి విజ్ఞప్తి
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వినాయక చవితి పండుగ రోజు విపరీతంగా పంటలు నష్టమయ్యాయి. పక్షం రోజుల క్రితం విపరీతంగా కురిసిన భారీ వర్షానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో భారీ వరద ప్రభావంతో రైతుల పంట పొలాలు తీవ్రంగా నీట మునిగి తేటతెర్లయ్యాయి. క్షేత్రస్థాయిలో నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ, సంబంధిత శాఖ అధికారులు సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎన్నో సంవత్సరాల తరువాత భారీ వర్షం కురవడంతో నియోజక వర్గంలోని పలు మండలాల్లో రైతులు పంటలు నీట మునిగి ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి నుండి ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై కొట్టుకు పోయిన రహదారుల మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను సాగించాలని అన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ విజ్ఞానవంతుడు నియోజకవర్గంలో స్థానికంగా ఉండి ప్రజల సమస్యలను పట్టించుకోన ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయని కూలిపోయిన ఇండ్ల యజమానులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో, భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల బిజెపి అధ్యక్షులు పెద్ద ఎడ్ల నర్సింలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హైమారెడ్డి, బిజెపి కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావ్, ఎల్లారెడ్డి మండల బిజెపి నాయకులు ఎస్ న్ రెడ్డి,మర్రి బాల కిషన్, పట్టణ అధ్యక్షుడు, అంగంల్ దివిటి రాజేష్, నరేష్ పీకే, నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు హనుమాన్లు శ్రీనివాస్, దేవి సింగ్ పాల్గొన్నారు.