calender_icon.png 7 November, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం మెరుగు

07-11-2025 12:20:00 AM

అట్టహాసంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభం

నిర్మల్, నవంబర్ (విజయక్రాంతి): క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గ్రామంలోని, తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలో 11వ రాష్ట్ర జోనల్ లెవెల్ స్పోరట్స్ & గేమ్స్ మీట్ 2025- 26 క్రీడా పోటీల కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జోన్ పరిధిలో నాలుగు జిల్లాలకు చెందిన 1190 మంది విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని నిలబెడుతూ, ఆటల పోటీల్లో పాల్గొనాలని సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపు కోసం మళ్లీ ప్రయత్నిస్తూ, గెలుపొందిన వారు మరింత మంచి ఫలితాలు సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ,  విద్యార్థులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆటలు ఆడాలని తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. గతం తో పోలిస్తే క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెరిగిందని తెలిపారు. సీఎం కప్ పోటీలలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని, గతంలో ఎన్నడూ లేని విధంగా పతకాలు సాధించాలని గుర్తుచేశారు. అంతకుముందు క్రీడ పోటీల్లో పాల్గొనబోయే వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సిసి పరిచయ కవాతును నిర్వహిం చారు. ఆ తర్వాత తొలి రోజు నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొంటున్న విద్యార్థులను పరిచయం, చేసుకొని వాలీబాల్ ఆడటం ద్వారా క్రీడా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  డీఈవో భోజన్న, డిఐఈఓ పరశురాం, డివైస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ మల్లేష్, ఇతర అధికారులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు. మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. గతంతో పోలిస్తే క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డీఈవో భోజ న్న, డిఐఈఓ పరశురాం, డివైస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ మల్లేష్, ఇతర అధికారులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు.