07-11-2025 12:19:39 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): నైజీరియన్ల సహకారంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సంతోష్, సందీప్, శివకుమార్ ముఠాగా ఏర్పడ్డారు. బెంగళూరులో డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. వీరి వద్ద డ్రగ్స్ కొన్న సాయిబాబు, విశాల్‌రెడ్డి, సమీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2లక్షలు విలువ చేసే గంజాయి, ఐదు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు.