calender_icon.png 11 September, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో.. తిలాపాపం!

11-09-2025 12:00:00 AM

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది తలపండిన నేతలు చెప్పేమాట. ఇది అక్షరాలా సత్యం. ఎందుకంటే అప్పటి వర కు కలిసి ఉన్నవారు.. ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం.. రాజకీయంగా నిత్యం విమర్శించుకునే వారు ఎన్నికల వేళ కలిసి పోటీ చేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక సొంత పార్టీలో ఉండలేక లేదా పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపించి బహిష్కరణకు గురై..

సొంత కుటుంబ సభ్యులు గెంటేసిన నేతలు, కోకొల్లలు ఉన్నారు. ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం, సొంత పార్టీ నుంచి బహిష్కరణ ఎదురైన తర్వాత.. బయటికి వెళ్లి కొత్త పార్టీలను స్థాపించడం లేకపోతే.. తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీల్లో చేరడం దేశవ్యాప్తంగా జరుగుతు న్న తీరు నిత్యం చూస్తున్నాం. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ అటువంటిదే.

కవిత నీతులు వల్ల బోసినా, పని గట్టుకొని ఆరోపణలు చేసి నా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆమె వాళ్లతో విభేదించేది తెలంగాణ సమాజానికి ఉపయోగ పడే అంశం అస్సలు కాదు. పీకలదాకా లిక్కర్ స్కాంలో ఇరికి బీఆర్‌ఎస్ పతనానికి కారణమై, ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చినం దుకు, పార్టీలో స్థానం కోల్పోయినందుకు, చెప్పుమీద కుచ్చులాగా దయ్యాలు అం టూ వల్లిస్తూ, సుద్దపూసలా అవినీతి పరులంటూ కల్వకుంట్ల కళ్లలో పొడుస్తుంటే పార్టీ గిలగిలా కొట్టుకొంటుంది.

కవిత తన ను తాను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాజీనామా అస్త్రం సంధించి అక్రమ ఆస్తుల పంపకాలకు ముప్పురాకుం డా, షర్మిల వలే రాజకీయంగా బొందపెట్టుకోకుండా నాన్నా అంటూనే.. తోడపుట్టి నందుకు కేటీఆర్ వెనుకేసుకొచ్చినట్టుగా స్పష్టంగా కన్పించింది.

తన ఆంతరంగిక లేఖ లీక్ వీరుడంటూ సంతోశ్, బినామీ పోచంపల్లి అంటూ అక్రమార్జనలో హరీశ్ రావు వీరిని మించిన వారే లేరని, వీరి ధన దాహ లీలలు షాంపిల్‌గా బయటపెట్టింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు కల్వకుంట్ల కవిత రాజకీయ జీవితం తెలంగాణ ఉద్యమ సమయంలో తన విశ్వరూపాన్ని బతుకమ్మ పేరుతో జాగృతం చేస్తూ ఆట మొదలు పెట్టారు.

దోపిడీకి రాచబాట

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం అయ్యాక తొలినాళ్లలోనే ఎంపీగా గెలిచి, రెండవ దఫా ఓడిపోయినా వెంటనే నవ్విపోదురు కాకా నాకేంటి సిగ్గు అన్నట్లు కుటుంబ పాలనకు ఊతం ఇచ్చేవిధంగా ఎమ్మెల్సీ కోసం పట్టుబట్టి అందలం ఎక్కి ఆమె పవ ర్ పాయింట్‌గా నిలిచారు. సౌకర్యవంతమైన జీవితంలో ఇమిడిపోయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు దోపిడీకి రాచబాట వేసుకున్నా రు.

ఏనాడూ గిదేంది బిడ్డా అని కేసీఆర్ అడగలేదు. ఎందుకంటే ‘నీవు నేర్పిన విద్య యే నీరజాక్ష’ అన్న చందంగా కుటుంబం నాలుగు రూపాలుగా విడిపోయి సంపాదనకు ఎగబడ్డారనే ప్రచా రం ఉంది. అందు కే ప్రజానీకానికి మం డింది అధికారం పోయింది. కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ మందకొడిగా ఉందని, రేవంత్ కాపాడుతున్నారని బీజేపీ పలుమార్లు ఆరోపణలు చేసింది. కానీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరిగా శాసనసభ సాక్షిగా సీబీఐకి అప్పగించడంతో బీజేపీ కంగుతిన్నది. తెలంగాణ ధరణి పేరుతో వందల ఎకరాలు ‘కల్వకుంట్లయ స్వాహా’ అయ్యాయ ని విపక్షాలు చేసిన ఆరోపణలకు కవిత ఆధారమైంది.

సీబీఐకి రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చేసరికి కాళేశ్వరంలో హరీశ్ రూ.వేల కోట్లు సంపాదిం చారని, కేసీఆర్‌కు సం బంధం లేదని బుకాయించింది. ఇక కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్, ఓఆర్‌ఆర్ స్కాం మాత్రం వెనకేసుకొచ్చింది. అదే జోగినపెల్లి సంతోష్ ఎకో ఫారెస్టు పేరుతో వేలాది ఎకరాలు కాజేశారని, అధికారం లేకముందు చిల్లిగవ్వ లేని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వరికోలు శ్రీమంతుడు ఎలా అయ్యాడని దుయ్యబట్టింది.

అణుబాంబులా..

భారత రాష్ర్ట సమితిగా ఏ టైంలో నామకరణం చేసారో కానీ పార్టీ కష్టాలకు అంతే లేనట్టుంది. తాజాగా కేసీఆర్ తన య కల్వకుంట్ల కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసినా అంపశయ్య మీద ఉన్న ఆ పార్టీ ప్రతిష్టకు విఘాతమే. నేనే రాజు నేనే మంత్రి అంటూ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ అహంకారంతో ప్ర జాదరణకు దూరమై కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా ఈ కార్ రేస్, లిక్కర్ స్కాం లాం టి అనేక అక్రమాల్లో ఇరికి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పార్టీకి కవిత అణుబాంబులా పేలింది. బీఆర్‌ఎస్‌లో కీలకంగా భా వించిన హరీశ్, సంతోశ్‌ను తూర్పార ప ట్టింది.

రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్ట్ అవినీతి కేసు సీబీఐకి అప్పజెప్పడంతో బాణీ మార్చింది. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదని, అవినీతికి సంబంధం లేదని అం టూనే ఎనుకటికి చిత్రగుప్తుడు బ్రాహ్మణుని పాపాల చిట్టా చదివినట్టు అక్రమా లకు తన్నీరు హరీశ్‌రావు, సంతోశ్‌రావు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారణమని బహిరంగ ఆరోపణకు దిగింది. 

పగ్గాలు హరీశ్‌కు వెళ్తాయనే..

బీఆర్‌ఎస్‌లో అగ్ని జ్వాలలు రావడానికి ఆస్తుల పంపకం ఒకటైతే.. కేసీఆర్‌కు ఆరో గ్యం సహకరించక ఫాం హౌజ్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో పోయే పరిస్థితి కనబడడంలేదు. కేటీఆర్‌లో స్థిర చిత్తం లోపించడం పలు ఆరోపణలు ఎదుర్కొనడం పార్టీ పగ్గాలు హరీశ్ చేతికి పోతాయనే లీక్‌తో టార్గెట్ చేసిందనే అభిప్రాయం ఉంది. పైగా రేవం త్ మద్దతు సంతోశ్, హరీశ్‌కు ఉందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.

ల్వకుంట్ల కుటుంబం గురించి అణువణువూ తెల్సిన నాయకుడు రేవంత్ కేసీఆర్ పార్టీలో లుకలుకల వైపు చూడాల్సిన అవసరం ఆయనకు లేదు, ఈ సమయంలో ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ తనయ కవిత రాజకీయ అనుభవం రెండు దశబ్దాలు కావొచ్చు కానీ అధికారదాహం ఎక్కువ, ఒకనాడు తెలంగాణ మంత్రి మండలిలో మహిళలకు స్థానం లేకున్నా స్పందించలేదు.

ఓబీసీల రిజర్వేషన్లు 34 నుంచి 23కు తగ్గించినందుకు నోరు మెదపలేదు. పంపకాలలో తేడా వచ్చినందుకు మహిళా సాధికారిత, సామాజిక తెలంగాణ ఉద్యమం ఎజెండా ఎత్తుకుంది. లిక్కర్ స్కాంలో పీకల లోతు లో ఇరుక్కున్న ఆ కుటుంబంపై దుమ్మె త్తి పోసినా బీజేపీలో ఆమెకు చోటు లేదనేది యదార్థం.

అక్రమార్జనకు మారుపేరైన కల్వకుంట్ల కవిత ఇంటి పేరు దేవనపల్లి మార్చినంత మాత్రాన కాంగ్రెస్‌లో గుండు మొనంత స్థలం దొరకనీయరనేది బహిరంగ రహస్యం. ‘నాన్న.. అన్నా’ అంటూ మొరపెట్టుకున్నా సొంత పార్టీకి తిరిగి తీసుకునే పరిస్థితి ఎలాగూ లేదు.‘ఇంటి దీపం కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిందన్నట్టు’ చేసిన నిర్వాకానికి ఎందుకు ఆ సాహసం చేస్తారు? 

ఇంటి పేరు మార్చినంత మాత్రాన..

లిక్కర్ స్కాం కేసులో బయటపడాలం టే ఒక్కటే మార్గం సామాజిక తెలంగాణ ఎజెండాతో రెండు కళ్ల పసుపు జెండా తప్ప వేరే మార్గం లేదు. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ నీడలో తిరిగి, గడ్డి బండి కింద పోయి న కుక్క మాదిరిగా నేనే పార్టీని మోసిన అంటే ‘జాగృతి’ కి భవిష్యత్ ఉండదు, కవిత ఆరోపణలపై హరీశ్ స్పందన చూ స్తుంటే ఆమె స్థానం ఏమిటో ప్రజలకు అర్థం అయ్యింది.

హరీశ్, సంతోష్‌ను అనుబంధ కుటుంబంగా చిత్రీకరించి, ఆరోపణ లకు బ్యాలను చేయడం కేసీఆర్, కేటీఆర్ ఎత్తుగడలో భాగంగా హరీశ్, సంతోశ్‌ను పొమ్మనలేక పొగపెట్టినట్టు కన్పిస్తుంది. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుంది కదా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అక్రమాలలో సుద్దపూస వాటా ఎంతో బీఆర్‌ఎస్ తేల్చాలి.   

 సెల్ : 9866255355