17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

17-02-2026 05:54 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

కోనరావుపేట,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.