17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సుల్తానాబాద్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 05:48 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అంబరాన్ని తాకేలా నిర్వహించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ నిర్వహించిన అనంతరం పలువురు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా చావు నోట్లో తలపెట్టి 12 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

రాష్ట్రాన్ని సాధించి తొమ్మిది ఏళ్లు ప్రజలకు ఏ కష్టం రాకుండా పెద్ద కొడుకుల రాష్ట్రాన్ని పాలించాడని దేశం మెచ్చే స్థాయికి తెలంగాణను తీసుకువచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపిన గొప్ప నాయకుడన్నారు. ప్రజల కోసం నిర్విరామం తపించి అపర భగీరథ ప్రయత్నం చేసి సఫలీకృతం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.

కెసిఆర్ చేసిన అభివృద్ధి నేడు రాష్ట్రంలో విరాజిల్లుతోందని ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు కానీ హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తిరిగి తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా తిరిగి అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాల రామారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మండల పార్టీ కన్వీనర్ బోయిని రాజ మల్లయ్య,తాళ్లపల్లి మనోజ్ గౌడ్,  సర్పంచులు దీకొండ భూమేష్ కుమార్, ఓజ్జా సంపత్, బోయిని శ్రీనివాస్ చొప్పరి అంజయ్య, పార్టీ శ్రేణులు సుర శ్యామ్,  ఉప సర్పంచ్ గుర్రం శ్రీనివాస్ గౌడ్,తిప్పారపు దయాకర్,  ఎండి సాజిద్, కోడం అజయ్, సంజీవరెడ్డి, గట్టు శ్రీనివాస్, శీలం శంకర్,గుర్రం సంపత్, మొలుగూరి అంజయ్య గౌడ్, గరిగంటి కుమార్ బాబు కంపల్లి రాజు లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.