calender_icon.png 18 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలియన్‌వాలాబాగ్ నేపథ్యంలో..

18-05-2025 12:08:36 AM

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలాబాగ్’. ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కసాండ్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తొలుత హిందీలో ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు.

హిందీ వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ మే 23న విడుదల కానున్న నేపథ్యంలో శనివారం ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తర్వాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయకుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిందీ ట్రైలర్.

అక్షయ్‌కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. ఆర్ మాధవన్, అనన్య పాండే పాత్రలూ ఆకట్టుకున్నాయి. సమగ్ర పరిశోధనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు భావోద్వేగంతో నిండిన కోర్ట్ సన్నివేశాలకు రియలిస్టిక్‌గా, ఆకట్టుకునేలా చూపించాడు. ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్ ఉదంతాన్ని ఉద్దేశించి ‘పసిపిల్లల గుండెల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.. వాళ్ల చేతిలో ఏం ఆయుధాలు చూశారు? చేతి కడియాలా.. వారి పిడికిళ్లా?’ అంటూ న్యాయవాది శంకరన్ నాయర్ వాదించిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.