calender_icon.png 14 July, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షల విషయంలో తగ్గేదేలే!

16-07-2024 01:10:37 AM

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, వాయిదాలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అనుకుంటుం టే.. మరోవైపు అభ్యర్థులు డీఎస్సీ, గ్రూప్ గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆందోళనలు చేయాల్సింది పోయి ఇలా వాయిదా కోరడమేంటని చర్చించుకుంటున్నారు. మరికొందరేమో అభ్యర్థులు పరీక్షలు మంచిగా రాసేందుకు తగిన సమయాన్ని ఇస్తే ప్రభుత్వానికి ఏమవుతుందని వాదిస్తున్నారు.