30-01-2026 12:32:19 AM
పలు పార్టీల అభ్యర్థులు హడావుడితో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి
హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 28 వార్డులకు గాను మొత్తం 67 నామినేషన్లు
నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు గాను మొత్తం 37 నామినేషన్లు
హుజూర్ నగర్, జనవరి 29: హుజూర్ నగర్,నేరేడుచర్ల పురపాలక సంఘాలలో జరుగుతున్న సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నామినేషన్ల స్వీకరణ హడావుడిగా కొనసాగింది. గురువారం హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 28 వార్డులకు గాను మొత్తం 67 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.వివిధ పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ తరుపున 19 నామినేషన్లు,భారత రాష్ట్ర సమితి పార్టీ తరుపున 27 నామినేషన్లు,భారతీయ జనతా పార్టీ తరుపున 11నామినేషన్లు, సిపిఐ (ఎం) పార్టీ తరపున 3 నామినేషన్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 నామినేషన్లు, రికగ్నైజ్డ్ పార్టీ తరుపున 3 నామినేషన్లు పలువురు అభ్యర్థులు వేశారు.
నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు గాను మొత్తం 37 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు తెలిపారు. వివిధ పార్టీల పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ తరుపున 17 నామినేషన్లు,భారత రాష్ట్ర సమితి తరుపున 11 నామినేషన్లు,భారతీయ జనతా పార్టీ తరుపున 5 నామినేషన్లు, తెలుగుదేశం పార్టీ తరపున 1 నామినేషన్, ఇండిపెండెంట్ అభ్యర్థులు 02 నామినేషన్లు, రికగ్నైజ్డ్ పార్టీ తరుపున 1 నామినేషన్ పలువురు అభ్యర్థులు వేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్నట్లు హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు బండి మోహన్, రవీందర్ నాయక్, ఏఎస్‌ఐ బలరాంరెడ్డి, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్,మేనేజర్ యాకుబ్ భాష, తదితరులు పాల్గొన్నారు.