calender_icon.png 30 January, 2026 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయపడిన వృద్ధుడికి తక్షణ వైద్యం

30-01-2026 12:31:28 AM

బేగంపేట డివిజన్ ట్రాఫిక్  ఏసపీ జీ.శంకర్ రాజ్

సికింద్రాబాద్ జనవరి 29 (విజయ క్రాంతి): స్కూటీపై ప్రయాణిస్తుండగా కార్ఖానా, వాసవి నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ (65) తన స్కూటీపై కెఎఫ్ సి ఎదురుగా రోడ్డుపై గురువారం వెళుతుండగా ఒకసారి గా స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాద ఘటన గమనించిన ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్ రాజు, తిరుమలగిరికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్  చెంది న మొబైల్ 4 సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు.

ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ఆంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం చిక్కడపల్లి శ్రీకర్ హాస్పిటల్‌కి తరలించారు. ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్ల గాయపడిన వృద్ధుడికి తక్షణ వైద్య సహాయం అందించి, మరింత ప్రమా దం తలెత్తకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ  వాహనదారులు ముఖ్యంగా వృద్ధులు వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.