30-01-2026 12:32:49 AM
అబ్దుల్లాపూర్ మెట్, జనవరి 29: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి నాగోల్ సర్కిల్ , 52 డివిజన్ పెద్ద అంబర్ పేట్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్ పేట్ డివిజన్ శబరిహిల్స్ కాలనీ సర్వే నెంబర్ 265లో గతంలో లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయించారు. ఇదే సర్వే నెంబర్ పక్కన ఉన్న సర్వేనెంబర్ 346 ఉంటుంది.
346 సర్వే నెంబర్ కు సంబంధించిన భూ యజమాని సర్వేనెంబర్ 265 శబరి హిల్స్ సంబంధించిన దాదాపు 20 ఫ్లాట్లు, రోడ్డును కబ్జా చేసి అక్కడ అక్రమంగా ఫ్రీ కాస్ట్ వాలు నిర్మించడంతో, శబరి హిల్స్ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్, 20 ప్లాట్లకు సంబంధించిన ఓనర్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యా దు చేశారు. రూ. 3 కోట్ల విలువ చేసే ప్లాట్లు కబ్జా గురైనట్లు కాలనీ అసోసియేషన్ సభ్యు లు హైడ్రాధికారులకు వివరించినట్లు తెలిసింది.
దీంతో హైడ్రాధికారులు పూర్తిస్థాయి లో పరిశీలించారు. శబరి హిల్స్ కు సంబంధించిన ప్లాట్లు, రోడ్డు కబ్జా జరిగింది వాస్తవ మేనని తెలుసుకొని ఆ నిర్మాణాలను గురువారం హైడ్రాధికారులు కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్ స్పెక్టర్ ఆర్. సైదు లు, హైడ్రా సిబ్బంది తదితరులు ఉన్నారు.