07-05-2025 10:15:24 PM
శుభ పత్రికను ఆవిష్కరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ..
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండలంలోని కోతులారం గ్రామంలో అతి పురాతనమైన శివాలయము అయినా శ్రీశ్రీశ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థాన తృతీయ బ్రహ్మోత్సవాలు 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాదులోని సచివాలయంలో దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ(Minister Konda Surekha) దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆహ్వాన శుభ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ... దేవాలయాలు మానవతాకు నిలయాలని దేవాలయాలను కాపాడుకునే బాధ్యత భక్తుల దేనిని ఆమె అన్నారు. కేదారేశ్వర ఆలయానికి 400 సంవత్సరాల పూర్వ చరిత్ర ఉండడం చాలా గొప్ప విషయమని ఈ దేవాలయం భవిష్యత్తులో నల్లగొండ జిల్లాలోనే కాక తెలంగాణలోనూ దివ్య క్షేత్రంగా మారనున్ననదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. మంత్రిని కలిసిన వారు మాజీ సర్పంచ్ జాజుల పారిజాత సత్యనారాయణ, కనకాల శ్యాం కురుమ జాజుల కోటయ్య, గుజ నరసింహ, వట్టి కోటి వెంకటేష్, పందుల అంజయ్య, నల్ల నాగిరెడ్డి, జాజుల రవీందర్, జే వెంకటేష్ కర్నాటి లింగస్వామి ఉన్నారు.