31-08-2025 12:58:16 AM
కరీంనగర్, ఆగస్టు ౩౦ (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో శాత వాహన వెల్ఫేర్ సొసైటీ నెలకొల్పిన వినాయ క విగ్రహ మంటపం వద్ద శనివారం స్థానిక ముస్లిం దంపతులు సైఫ్ సీమలు పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించి గజమాలను సమర్పించారు.
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వంగా మతసామరస్యానికి ప్రతీకగా ఉంటుందని వారు పేర్కొన్నారు. రాబోవు కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాదికి గణపతి విగ్రహాన్ని సొంత ఖర్చులతో కొనిస్తాన న్నారు. కార్యక్రమంలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ రాములు, భిక్షపతి, దయాకర్, లక్ష్మ ణ్, శ్రీనివాస్, సంపత్, వినీత్ పాల్గొన్నారు.