24-01-2026 12:19:32 AM
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
సూర్యాపేట, జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తప్పు చేసిందని, అధికారులే బలి పశువులు అవుతారని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇచ్చిన హామీలను మరచిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రధానమంత్రి పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని బయట తీసేందుకు క్రీడా మహోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.