24-01-2026 12:18:48 AM
కరీంనగర్, జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్‌తోపాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీ ఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్ర భుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని విమర్శించారు.
విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుంచి ఏఐసీసీకి ముడుపులు వెళ్తున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ టీవీ సీరియల్‌ను మించి, ఆది అంతం లేకుం డా కొనసాగుతూనే ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే చర్యలు తీసుకుం టామని వివరించారు.