calender_icon.png 24 January, 2026 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే

24-01-2026 12:20:29 AM

కోదాడ, జనవరి 23: సూర్యాపేట జిల్లా పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సముద్రాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి పత్తిపాక జనార్ధన్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కుల సంఘాలు సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బుడిగం కిరణ్ కుమార్, రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు తునం కృష్ణ, బచ్చు అశోక్, పీ.వేణుధర్, పి. నర్సయ్య, నట్టె కిరణ్ కుమార్, బత్తిని కృష్ణమూర్తి, శివయ్య, కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.