29-09-2025 12:22:02 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఆ దివారం భద్రాచలంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభలో పాల్గొనేందుకు ములకలప ల్లి మండలం నుంచి ఆదివాసి శ్రేణులు భారీ గా తరలి వెళ్లాయి. వివిధ ఆదివాసి సంఘా ల నాయకులు, కార్యకర్తలు, మహిళలు,యు వత,విద్యార్థి, రైతులు ఇక్కడి నుంచి వాహనాల్లో భారీగా తరలివెల్లి భద్రాచలం సభలో పాల్గొన్నారు.
బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి రిజర్వేషన్లను అందిపుచ్చుకోలేకపోయినా ఆదివాసీలకు న్యాయం చే యాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ధర్మ యుద్ధం పేరిట ఆదివాసి సంఘాల నా యకుల ఆధ్వర్యంలో భారీ సభను,ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని 20 గ్రామ పంచా యతీల నుంచి వివిధ ఆదివాసి సంఘాల నాయకుల నేతృత్వంలో ఆదివాసీలు భారీ గా తరలి వెళ్లారు. వాహనాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకొని గ్రామాలలో ని నాదాలు చేస్తూ వాహన శ్రేణిలో ఆదివాసీలు పాల్గొన్నారు.