calender_icon.png 19 September, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ప్రతిభావంతులకు ‘అగ్ని అవార్డ్స్’

18-09-2025 10:26:49 PM

అవార్డ్స్ ఇచ్చే సంస్థలు కొత్త వారికోసం ఒకటో రెండో కేటగిరీలు పెడుతుంటాయి. కానీ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకే ఎక్స్‌క్లూజివ్‌గా పురస్కారాలు ఇవ్వబోతోంది ‘అగ్ని అవార్డ్స్ 2025’. ఇండియాలో తొలిసారి సినిమా, టీవీ, ఓటీటీల్లో ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపునిస్తూ వారికి పురస్కారాలు అందించనున్నారు. ఈ నెల 30న విజయవాడలో జరగనున్న ‘విజయవాడ ఉత్సవ్’ వేదికపైనే ఈ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించనున్నారు. 

ఉత్తమ పరిచయ కథానాయకుడు, ఉత్తమ పరిచయ కథానాయకి, ఉత్తమ పరిచయ దర్శకుడు/దర్శకురాలుతోపాటు క్రియేటివ్ బ్రిలియన్స్, టెక్నికల్ మాస్టెరీ, మ్యూజిక్ అండ్ పర్‌ఫార్మెన్స్ విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వనున్నారు. అగ్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న విజేతలకు గోల్డెన్ టార్చ్ ట్రోఫీ బహూకరిస్తారు. 

సెలెబ్రిటీలతో కూడిన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేయనుంది. వారి గురించి స్టార్స్ చెప్పే మాటలు, రెడ్ కార్పెట్ కవరేజ్, లైవ్ మీడియా టెలికాస్ట్ ఉంటుంది. ప్రస్తుతం ‘అగ్ని అవార్డ్స్ 2025’ సంబంధించిన నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఫిల్మ్, టీవీ, ఓటీటీల్లోని ఫ్రెష్ టాలెంట్ తమ పేర్లను www.agniawards.com. వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.