18-09-2025 10:47:07 PM
బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా స్పోక్స్ పర్సన్ సీమా సోమనాథ్
ఎల్బీనగర్: డ్రగ్స్ రహిత దేశం కోసం బీజేపీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 21న "3కే నమో యువరన్"ను చేపట్టనున్నారని బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా స్పోక్స్ పర్సన్ సీమ సోమనాథ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మన్సూరాబాద్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 3కే రన్ నమో యువరన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 21న ఆదివారం నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే 3కే నమో యువరన్ లో జిల్లా బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.