calender_icon.png 29 October, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావుకు పితృవియోగం

29-10-2025 01:26:56 AM

-మాజీ మంత్రి తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత

-నివాళులర్పించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్

-సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, రాజకీయ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 28 (విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట విషా దం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు (88) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు హరీశ్‌రావు నివాసానికి చేరుకుని సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులర్పిం చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వేర్వేరుగా తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

బావను స్మరించుకున్న కేసీఆర్

సత్యనారాయణరావు మరణవార్త తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో హరీశ్‌రావును పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు నివాసానికి చేరుకుని తన బావ సత్యనారా యణ రావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన బావతో ఉన్న అనుబ ంధాన్ని గుర్తుచేసుకుంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పార్టీ కార్యక్రమాలు రద్దు చేసిన కేటీఆర్

విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హరీశ్‌రావు నివాసానికి చేరుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యనారాయణరావు పార్థివదేహానికి నివాళుల ర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో సోమవారం జరగాల్సిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంతో పాటు అన్ని పార్టీ కార్య క్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ప్రకట నలో సత్యనారాయణరావు మృతికి సంతాపం తెలిపారు.

ప్రభుత్వం తరఫున ప్రముఖుల సంతాపం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావుకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మంత్రులు దామో దర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీత క్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  పీసీసీ అధ్య క్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కూడా సంతా పం ప్రకటిస్తూ.. తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన సత్యనారాయణరావు అంత్యక్రియల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విశ్రీనివాస్ గౌడ్, గంగుల కమ లాకర్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర ముఖ్య నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. హరీశ్‌రావు ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలి

 మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ ఆత్మకు శాంతి కల గాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. హరీశ్‌రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

  సీఎం రేవంత్‌రెడ్డి

ప్రగాఢ సానుభూతి 

బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ రావు మరణం చాలా బాధాకరం. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్న. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడికి ప్రార్థిస్తున్న. హరీష్‌రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 

 ఏపీ సీఎం చంద్రబాబు

చాలా బాధాకరం

 మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరం. ఆయన చాలా మంచి వ్యక్తి. రాజకీ యాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా నాకు సాన్నిహిత్యం ఉంది. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలి. హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్న. 

 బండి సంజయ్, కేంద్రమంత్రి