calender_icon.png 29 July, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్ నగర్ లో పర్యటించనున్న మంత్రి ఉత్తమ్

28-07-2025 11:43:55 PM

నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్..

పది ఏండ్ల రేషన్ కార్డు కలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వం..

హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని మంగళవారం కౌండిన్య ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పలు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరపరాల శాఖ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddyఅందజేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలంలోని నూతనంగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు దారులకు రేషన్ కార్డులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డును తీసుకోవాల్సిందిగా హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు.