03-01-2026 12:00:00 AM
గుర్రాలగొంది సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్
సిద్దిపేట రూరల్, జనవరి 2: సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ పరిధిలోని చిన్నరాయిని చెరువుకు కాల్వల ద్వారా సాగునీరు నింపాలని, అసంపూర్తిగా ఉన్న ఇరిగేషన్ కాల్వల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని గుర్రాలగొంది సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇరిగేషన్ శాఖ డీఈ ఆంజనేయులును రైతులతో కలిసి కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామం గుండా వెళ్లే ఆర్డి4అర్‌ఏం 2, ఆర్డీ3ఎల్‌ఏం 3, ఆర్డీ 3ఎల్‌ఏం3ఎల్‌ఎస్‌ఏం 1 కాల్వల పనులు పూర్తి చేస్తే వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రాలగొంది, జక్కాపూర్, గోపులాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు