calender_icon.png 23 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా క్రికెటర్ల దేశవాళీ వేతనాల పెంపు

23-12-2025 12:38:22 AM

  1. పురుషులతో సమానంగా చెల్లింపు
  2. బీసీసీఐ కీలక నిర్ణయం

ముంబై, డిసెంబర్ 22 : మహిళల క్రికెట్‌కు సంబంధించి బీసీసీఐ మరో కీలక నిర్ణ యం తీసుకుంది. పురుషుల జట్టుకు ఏ మాత్రం తగ్గకుండా వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తున్న బీసీసీఐ ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో వారి వేతనాలను భారీగా పెంచింది. పురుషులతో సమానంగా వేతనాన్ని అందించాలని నిర్ణయించింది.  దేశవా ళీ వన్డే, మల్డీ డే మ్యాచ్‌లకు సంబంధించి తుది జట్టులో ఉన్న ప్లేయర్స్‌కు రోజుకు రూ.50 వేలు చొప్పున లభించనుంది. నాన్ ప్లేయింగ్ ప్లేయర్స్ కు రూ.25 వేల చొప్పున దక్కనుంది.

అలా గే దేశవాళీ టీ20 మ్యాచ్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న క్రికెటర్లకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్స్‌రు రూ.12,500 చొప్పున చెల్లించనుంది. గతంలో తుది జట్టు ప్లేయర్స్‌కు రూ.20 వేలు, రిజర్వ్ ప్లేయర్స్‌కు రూ.10 వేలు చొప్పున చెల్లించేవారు. అటు జూనియర్ క్రికెట్ టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్స్‌కు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్స్‌కు రూ.12,500 లభించనున్నాయి. అలాగే టీ20 మ్యాచ్‌లకు సంబంధించి తుది జట్టు లో ప్లేయర్స్‌కు రూ.12,500, రిజర్స్ ప్లేయర్స్‌రు రూ.6,250 చెల్లించనున్నారు.