23-12-2025 02:32:38 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించి పంట కొనుగోలు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ గోడౌన్‌ను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లోని సోయాబీన్ నిల్వలను, వాహనాల ద్వారా ఎగుమతి, దిగుమతి ప్రక్రియను పరిశీలించి, అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిగుమతి అవుతున్న సోయాబీన్ నాణ్యత శాంపిల్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట మేనేజర్, రవి కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ సాయి కృష్ణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.