calender_icon.png 23 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణప్ప గౌతమ్ రిటైర్మెంట్

23-12-2025 12:36:41 AM

బెంగళూరు, డిసెంబర్ 22 : కర్ణాటక స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పి న్నర్ కమ్ బ్యాటర్ అయిన 37 ఏళ్ల గౌతమ్ 2021లో భారత్ తరపున ఒకే ఒక వన్డే ఆడా డు. ఆ తర్వాత అతనికి మరో అవకాశం రాలే దు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌కు, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గౌతమ్‌కు మంచి రికార్డుంది.కర్ణాటక తరపున 32 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.