23-12-2025 01:37:33 AM
బీఆర్‌ఎస్ లాగా మాకు గాల్లో మేడలు కట్టడం రాదు
మీ గేట్‌పాస్ కల్చర్‌కు మేం ఫుల్‌స్టాప్ పెట్టాం
తెలంగాణను నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ‘కేసీఆర్ మీది ‘హైప్’ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్.. మాది ‘హోప్’ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ‘మీ హయాంలో చేసిం ది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ.. మా హయాంలో చేసేదే ఎక్కువ, చెప్పుకునేది తక్కువ’ అని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ‘బీఆర్ ఎస్ లాగా మాకు గాల్లో మేడలను కట్టడం రాదు.. అరచేతి లో స్వర్గం చూపించడం అసలే రాదు.
అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దు.. పెట్టుబడులు రావొద్దు.. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దు... ఇదే బీఆర్‌ఎస్ పాలసీ అని మండిపడ్డారు. అందుకే రాష్ట్రం లో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపరుస్తున్నారని చెప్పారు. ఇది మంచిది కాదని, ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని హితవు పలికారు. ‘మీ హయాంలో ఏ కంపెనైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ కుటుంబం అనుమతి తప్పనిసరి.. అవునో కాదో చెప్పా లి’ అని అన్నారు.
మేము ఆ గేట్ పాస్ కల్చర్‌కు ఫుల్ స్టాప్ పెట్టామని, అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్‌కు తెలంగాణ బై ఛాయిస్ కాదు, బై డెస్టినేషన్‌గా మారిందన్నారు. అందుకే పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవో యూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుందన్నారు. ఇది హైప్ కాదని, ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్ కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’ అని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మేం చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యా పార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్‌కు రావడం అబద్ధమా అని ప్రశ్నించారు. మీ హయాంలోనూ అనేక ఎంవోయూలు జరిగాయని, కానీ అన్ని కంపెనీలూ పెట్టుబడు లు పెట్టాయా అని నిలదీశారు. ఒక్కో ఎంవో యూ గ్రౌండింగ్ అయ్యేందుకు చాలా సమ యం పడుతుందని, అది తెలిసి కూడా రెండేళ్లలో రూ.3.4 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చి న మాపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామని, కానీ మీరు మాత్రం ‘రియల్ ఎస్టేట్’ కోసమే అంటూ తప్పుడు ప్ర చారం చేయడం సమంజసం కాదన్నారు. మేం రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి అవసరాలకు అనుగుణంగా అన్ని ఒకేచోట ఉండాలనే గొప్ప సం కల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించామని వివరించారు. మీ హయాంలో ఓ అధికారి మంచి పాలసీని రూపొందించారని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ పాల సీలో ఉన్న నిబంధనలను మీరు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
ఉత్తమ ఆఫీసర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, సెక్రటే రియట్‌కే వెళ్లకుండా పాలన సాగించిన చరిత్ర మీదని విమర్శించారు. ప్రస్తుతం అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాభివృద్ధిలో వాళ్ల ను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ మీద పే టెంట్ మీదా, మరి మీ హయాంలో ఎందు కు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక ప్రణాళికా ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపో యిన పార్క్‌ను పూర్తి చేశామని, అక్కడికి ది గ్గజ కంపెనీలను తీసుకొచ్చామని చెప్పారు.
మా ప్రభుత్వంలో పరదాలు లేవు
వాస్తవాలు మాట్లాడితే ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్‌లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్‌లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణమని వెల్లడించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54 వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారని, మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని వివరించారు.
2024-25లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం జాబితాలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తేల్చిందని తెలిపారు. తెలం గాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షలు, కర్ణాటక-రూ.3.8 లక్షలు, తమిళనాడు - రూ.3.61 లక్షలు, మహారాష్ట్ర - రూ.3.09 లక్షలు అని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు ఒకసారి గతం కూడా చూసుకోవాలని హితవు పలికారు.
ఇది సీఎం రేవం త్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వమని, ఇక్కడ పరదాలు లేవు, ప్రగతి మాత్రమే ఉందని ఉద్ఘాంటించారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అబద్ధాలు ప్రచారం చేసి నా తెలంగాణను ప్రపంచ పటంలో నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతామని, ఇందులో రాజీ పడబోమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.